AP: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పని చేయాలని టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ సూచించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులకు రూ.4వేల పింఛన్, పేదలకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రారంభినట్లు పేర్కొన్నారు. జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.