ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో రేపు శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యల పై వినతులు స్వీకరిస్తామని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఉన్న 29 వార్డులలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు హాజరవుతారని తెలిపారు.