KMM: రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ వెల్ఫేర్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం కామేపల్లి (M) పాత లింగాల రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. తక్కువ సమయంలో అధిక దిగుబడి పొందే వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.