ATP: తాడిపత్రిలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో ఈ నెల 17న మ.2 నుంచి సా.5 గంటల వరకు ఉచిత మూర్ఛ వ్యాధి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ గోపాలం శివన్నారాయణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.