PPM: సాలూరులో జరిగే శ్యామలాంబ జాతరకు ఉమ్మడి జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి 1,240 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్గ తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీల్లో120 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. 20, 21న 500 చొప్పున సర్వీసులు ఉంటాయన్నారు. భక్తుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా వీటిని నడుపుతున్నట్లు ఆమె చెప్పారు.