PLD: మాజీ మంత్రి విడదల రజిని ఊసరవెల్లి రాజకీయాలు మానుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ చిలకలూరిపేట నియోజకవర్గ నేత విజయసాయి ఆరోపించారు. ఆమె ఐదేళ్ల పాలనలో భూకబ్జాలు, అరాచకాలు పెరిగాయని విమర్శించారు. ఆమె పీఏలు, అనుచరులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని, ఇప్పుడు వారిని కాపాడుతూ పోలీసులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.