మన్యం: పాలకొండ మండలలో కోర్టు ఎదురుగా గల ఇన్నోవేషన్ రెండో అంతస్తులో బీసీ కార్పొరేషన్ ద్వారా 90 రోజుల ఉచిత కుట్టు మిషన్ శిక్షణా శిబిరాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గురువారం ప్రారంభించారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రత్నరాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.