GNTR: గుంటూరు ITC హోటల్లో గురువారం జరిగిన జాతీయ రీ సర్వే వర్క్‌షాపులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 6688 గ్రామాల్లో తప్పులుగా రీ సర్వే జరిగిందని, పేదల భూములకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 628 గ్రామాల్లో తొలిదశను పూర్తి చేసిందని తెలిపారు.