ASF: కెరమెరి మండలం అనార్ పల్లి,లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వాగు ఉప్పొంగడంతో 6 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. స్పందించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి వంతెన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.