గుంటూరు జిల్లా AP ECET 2025 ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో పరీక్షకు మొత్తం 1786మంది రిజిస్టర్ చేసుకోగా, 1733 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1081 మంది పురుషులు, 652 మంది మహిళలు ఉన్నారు. పరీక్షకు హాజరైన వారిలో, మొత్తం 1633 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 1003మంది పురుషులు, 630మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో మొత్తం ఉత్తీర్ణత శాతం 94.23%.