JGL: మెట్పల్లి పట్టణానికి చెందిన ఆకుల లక్ష్మీ-నర్సయ్య దంపతుల పెద్ద కుమారుడు ఆకుల ఆనంద్ 2005లో ఆర్మీలో చేరారు. 20 సంవత్సరాల్లో అంబలా, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, ఝాన్సీ, హర్యానా, చంఢీగడ్, లేహ్, లద్ధాక్లో వివిధ హోదాల్లో పని చేశాడు. బుధవారం ఆయనకు ఝాన్సీ ఆర్మీ కంటోన్మెంట్ జూనియర్ కమాండ్ ఆఫీసర్గా పదోన్నతి లభించింది.