KNR: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసత్యపు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నిరసిస్తూ బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.