• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు దరఖాస్తుల ఆవాహనం

JN: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో విశేష సేవలందించిన కళాకారులకు కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు అందజేస్తోంది. జనగామ జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డ్ గ్రహీతలకు రూ.25 వేలు నగదు, చేనేత శాలువా, మెమెంటో సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.

March 20, 2025 / 08:15 PM IST

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం

KMR: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.

March 20, 2025 / 07:59 PM IST

మహిళ మిస్సింగ్.. కేసు నమోదు

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కంపేల మానస అనే మహిళ అదృశ్యం అయినట్లు ఎస్ఐ ప్రసాద్ గురువారం ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బ్యాంకు పనిమీద బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మానస తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

March 20, 2025 / 07:56 PM IST

శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ

HNK: కాజీపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నేడు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను భక్తులు విడుదల చేశారు. ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో భక్తులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

March 20, 2025 / 07:42 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ఆదిలాబాద్: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలను మూసి వేసి ఉంచాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు.

March 20, 2025 / 07:00 PM IST

ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించాలి: కలెక్టర్

ADB: జైనథ్ ఆదర్శ పాఠశాలలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా గురువారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, వాటిని సాధించి సమాజానికి సేవ చేయాలని సూచించారు. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.

March 20, 2025 / 06:55 PM IST

‘పశు సంపదతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలి’

JN: పశుసంపదతో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ రైతులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ గౌరీ గోశాల ఆధ్వర్యంలో 62 గోవులను రైతులకు ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గోశాల ద్వారా ఉచితంగా రైతులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు. గోవులను కాపాడుకోవాలన్నారు.

March 20, 2025 / 06:51 PM IST

‘పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ భద్రత’

MLG: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు ఎస్పీ శబరిష్ కీలక సూచనలు చేశారు. 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు, లౌడ్ స్పీకర్లు మూసివేయాలని ఆదేశించారు. అలాగే, 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడవద్దని హెచ్చరించారు.

March 20, 2025 / 06:51 PM IST

‘రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు ఏర్పాటు పూర్తి’

SRCL: రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా లో పదోతరగతిలో 3051 బాలురులు, 3717 బాలికలు మొత్తం 6768 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

March 20, 2025 / 05:21 PM IST

KC వేణుగోపాల్‌ను కలిసిన పెద్దపల్లి MP

MNCL: పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో పాటు పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ గురువారం AICC జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్‌ని కలిశారు. ఈ సందర్బంగా MP మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్, బీసీ కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి కీలక అంశాలతో పాటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.

March 20, 2025 / 04:57 PM IST

కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర ఆటో డ్రైవర్ల యూనియన్

NLG: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట పర్యటనకై వస్తుండగా.. నార్కట్ పల్లి వద్ద తెలంగాణ ఆటో మోటార్స్ ట్రెడ్ యూనియన్ సభ్యులు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్ అలీ, జిల్లా అధ్యక్షులు కలగొని యాదయ్య ఆధ్వర్యంలో KTR ను గురువారం కలిశారు. ఆటో కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

March 20, 2025 / 04:57 PM IST

పదో తరగతి పరీక్షల కేంద్రాల వద్ద BNSS యాక్ట్

KNR: కరీంనగర్ పోలీసు కమీషనరేట్ పరిధిలో జరిగే పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద మార్చి 21 నుండి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబందించిన ఉత్తుర్వులు ఇప్పటికే వెలువడ్డాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

March 20, 2025 / 04:43 PM IST

నిజామాబాద్ జిల్లా జడ్జిని కలిసిన పోలీస్ కమిషనర్

NZB: నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలని పోలీసు కమిషనర్ సాయి చైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్‌ని స్వాగతిస్తూ అభినందించారు.

March 20, 2025 / 04:05 PM IST

వాహనాల తనిఖీలలో 12 కిలోల గంజాయి స్వాధీనం

PDPL: రామగుండం NTPC పోలీసులు గంజాయి నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. NTPC ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ప్లాంట్ మెటీరియల్ గేట్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 12కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కరీంనగర్‌కు చెందిన మాల మల్లేశంను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి ములుగు, ఏటూరు నాగారం మీదుగా తెచ్చి విక్రయిస్తున్నారన్నారు.

March 20, 2025 / 03:57 PM IST

కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతుల కల్పన

SRCL: యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25లో పండిన నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఖ్యమ్య నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ తన ఛాంబర్‌లో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

March 20, 2025 / 03:49 PM IST