PDPL: రామగుండం NTPC పోలీసులు గంజాయి నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. NTPC ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ప్లాంట్ మెటీరియల్ గేట్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 12కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కరీంనగర్‌కు చెందిన మాల మల్లేశంను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి ములుగు, ఏటూరు నాగారం మీదుగా తెచ్చి విక్రయిస్తున్నారన్నారు.