NRML: నర్సాపూర్ జీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు అడవులు, వన్యప్రాణులు ప్రాముఖ్యతను సెక్షన్ అధికారి అలేఖ్య వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి, గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు వీణ, అధికారులు సాయి రెడ్డి, ఫాజిల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
JN: కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నిరంతర చైతన్యం అవసరం అన్నారు. ప్రజల మధ్యకు పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి, పేద ప్రజలకు మద్దతుగా నిలవాలనీ కోరారు. రానున్న ఎన్నికల్లో యూత్ కీలకమన్నారు.
HNK: జిల్లా కేంద్రంలోని రామకృష్ణ కాలనీ సమీపంలో నేడు గుర్తు తెలియని వ్యక్తులు మహిళా మెడలో నుంచి బంగారు చైన్ అపహరించుకు వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు కొండవీటి రాణి కిరాణం దుకాణం నిర్వహిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆటోలో దుకాణంలో సామాన్లు కొనుగోలు కోసం వచ్చినట్లుగా నటించి మెడలోని రెండున్నర తులాల బంగారపు గొలుసు తెంపుకొని పరారయ్యారు.
ADB: పట్టణంలోని 10వ తరగతి పరీక్ష నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలోనికి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష పూర్తి అయ్యేంతవరకు మూసి ఉంచాలని సూచించారు.
ASF: జిల్లా కేంద్రంలోని ZPHS పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. నిరంతరం విద్యుత్తు, త్రాగునీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
ASF: సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం హైదరాబాద్ నగరంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయానికి ఉప కులపతిగా నియమితులైన డా. పీవీ నందకుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచకుళ్ళ రాజేష్ రెడ్డి, డా. రాకేష్, డా. సత్యనారాయణ రెడ్డి, డా. ప్రమోద్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.
MNCL: ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నాక తిరుపతి, మంచిర్యాల ఆర్టిఏ మెంబర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. గ్రామంలో 189 ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు పాల్గొన్నారు.
MLG: వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చలేక మొక్కజొన్న రైతు పురుగుమందు తాగి లేక మధు కృష్ణ (31) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాండు అనే కంపెనీ మొక్కజొన్న వేసి తీవ్రంగా నష్టపోవడంతో అదికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోక పోవడంతో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్నట్టుగా గ్రామస్తులు తెలిపారు.
KNR: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ నూతన CP గౌస్ ఆలంను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలు, ప్రధాన వీధుల్లో CC కెమెరాల పర్యవేక్షణ, శివారు ప్రాంతాల్లో ప్రజల సమస్యల గురించి చర్చించారు.
NGKL: ట్రాన్స్‌పోర్ట్, హమాలి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం అందుకున్నారు. దీంతో బల్మూర్ మండల కేంద్రంలో స్థానిక సీపీఎం నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అంటూ వారు ప్రశ్నించారు.
MDK: శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా..తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ..పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
MDK: మంత్రాలు, చేతబడి అనేది లేదని, ఎవరైనా మంత్రాలు చేస్తామంటూ గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈమధ్య మంత్రాల నెపంతో ప్రజలను మోసం చేస్తున్నారని, దొంగ బాబాలను నమ్మొద్దని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉంటే ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
SDPT : హుస్నాబాద్ పశువుల అంగడి వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. జిల్లా అధికారుల అనుమతి మేరకు మున్సిపల్ కార్యాలయంలో రెండో సారి అంగడి వేలం నిర్వహిస్తున్నామన్నారు. అంగడివేలం కోసం డిపాజిట్లు చెల్లించిన వారు వేలం పాటకు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
NZB: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ జిల్లా నూతన డైరీ, క్యాలెండర్ను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నూడా ఛైర్మన్ కేశ వేణు, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, ఉమకంత్ తదితరులు పాల్గొన్నారు.
KMR: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో అభయహస్తం సొసైటీ సహకారంతో బర్ల గంగారం, బర్ల మధు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.