• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఓడిన అభ్యర్థులకు డబ్బులు తిరిగి ఇస్తున్న ఓటర్లు

NGKL: జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ, వంగూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు వారు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు సమాచారం. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓడిపోయిన అభ్యర్థులు విలపించడం చూసి చలించిపోయిన కొందరు ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

December 15, 2025 / 12:22 PM IST

పోలింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం

SDPT: 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 ప్రక్రియలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి నిర్వహించారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిపారు. జిల్లాలో మూడవ విడతలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి జరగనున్నాయి.

December 15, 2025 / 12:21 PM IST

చలి తీవ్రత పెరగని వరి నారుమడులు

VKB: దుద్యాల మండల వ్యాప్తంగా రైతులు యాసంగి సీజన్‌లో వరి పంట సాగు చేసేందుకు నారుమడులను ఏర్పాటు చేసుకున్నారు. పలువురికి చెందిన రైతులకు చెందిన నారు 15 రోజులు గడిచిన చలి తీవ్రతకు పెరగడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి నారుమడులకు పరిస్థితులకు తగ్గట్టు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు.

December 15, 2025 / 12:20 PM IST

నిర్మల్ రూరల్ గ్రామాల నూతన సర్పంచులు వీరే

నిర్మల్ రూరల్ గ్రామాల నూతన సర్పంచులుగా భాగ్యానగర్- జాదవ్ గంగూబాయి (కాంగ్రెస్) చిట్యాల్ – ఏనుగు సుప్రియ (BJP) కౌట్ల(కే) – ధుమల్ రాజా (కాంగ్రెస్) మేడిపల్లి – చింతలపల్లి ముత్తవ్వ ముక్తపూర్- మన్పూర్ రమేశ్ (కాంగ్రెస్) నీలాయిపేట్ – గొట్టం సుమలత (BJP) లంగ్డాపూర్ – కొండూరు ప్రశాంత్ (BRS) ఎల్లారెడ్డిపేట్ – గొర్ల అనురోజా (కాంగ్రెస్) రానాపూర్ – పవార్ నెహ్రూ (BJP)ల...

December 15, 2025 / 12:16 PM IST

కోట్లతో రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం

VKB: జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరిన పాత రైల్వే బ్రిడ్జి స్థానంలో రూ.96 కోట్లతో చేపడుతున్న కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు చురుకుగా సాగుతున్నాయి. త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

December 15, 2025 / 12:14 PM IST

నూతన సర్పంచులను సన్మానించిన మాజీమంత్రి

ADB: గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు మాజీమంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన అభ్యర్థులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీకి పట్టం కట్టారని జోగు రామన్న పేర్కొన్నారు.

December 15, 2025 / 12:10 PM IST

‘638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు’

GDWL: ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 700 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు సోమవారం కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు.

December 15, 2025 / 12:09 PM IST

రోడ్లు బాగుచేయాలని యువకుడి పొర్లుదండాలు

KNR: స్మార్ట్‌ సిటీ పనుల్లో భాగంగా వేసిన అండర్‌ డ్రైనేజీ చాంబర్లతో రోడ్లు ధ్వంసం కావడంతో, కిసాన్‌నగర్‌ 3వ డివిజన్‌ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పగుళ్లు, నిలిచిన మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు కాలనీవాసుల తరఫున దళిత మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్‌ వినూత్న నిరసన చేపట్టారు.

December 15, 2025 / 12:09 PM IST

‘మహాదేవ్ పూర్ గ్రామ అభివృద్ధికి తోడుంటా’

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం మహాదేవ్ పూర్ గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన అనూష రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలరాజు, వార్డు సభ్యులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్సీ అభినందించి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తోడుంటానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అభివృద్ధి చేయాలని వారికి సూచించారు.

December 15, 2025 / 12:08 PM IST

కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం ఇద్దంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పేరుతో గ్రామాలను బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

December 15, 2025 / 12:08 PM IST

నూతన పాలకవర్గం సభ్యులకు ఎమ్మెల్యే అభినందన

జగిత్యాల మండల ఒడ్డెర కాలనీ, అర్బన్ మండలంలోని మోతె, సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం సభ్యులు సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

December 15, 2025 / 12:03 PM IST

నిన్న వార్డు మెంబర్ గా గెలుపు.. అర్ధరాత్రి మృతి

NGKL: బిజినపల్లి మండలం వెంకటాపూర్‌‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ 7వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ మద్దతుదారు మహేష్ విజయం సాధించారు. అయితే, రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

December 15, 2025 / 11:58 AM IST

‘అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి’

NLG: గ్రామంలోని సమస్యలను పరిష్కరించడమే కాకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తానని చిట్యాల మండలం తాళ్ల వెల్లంల సర్పంచ్‌గా గెలిచిన జోగు సురేష్ అన్నారు. తన గెలుపుకు సహకరించిన గ్రామస్తులకు, కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జీపీ ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

December 15, 2025 / 11:52 AM IST

మూడవ విడత ఎన్నికలకు కౌంటు డౌన్ షురూ

ADB : మూడో విడత ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బోథ్ మండలంలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌లో ఉంది. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలకు గాను మూడు గ్రామ పంచాయతీలు మర్లపెళ్లి, చింతగూడ, కంటేగాం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 గ్రామపంచాయతీలకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. కాగా బోథ్ మేజర్ GPలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

December 15, 2025 / 11:51 AM IST

పడిపోయిన ఇళ్ల మట్టి తొలగింపు

MBNR: పట్టణంలోని రవీంద్రనగర్‌లో పాత ఇండ్లు కూలిపోయి పాములు సంచరించడం, అపరిశుభ్రంగా మారడంతో 53వ డివిజన్ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర కమిషనర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సోమవారం జెసిబి సహాయంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పడిపోయిన ఇళ్ల మట్టి, ముళ్లపొదలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

December 15, 2025 / 11:46 AM IST