NZB: వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఇది వరకే తీసుకువచ్చిన 90 రోజుల ప్రణాళికపై అన్ని కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్‌లతో సమావేశాలు నిర్వహించామని, అయినప్పటికీ పరిస్థితులలో మార్పులు రాకపోతే ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తానని నిజామాబాద్ DICO రవికుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ. వచ్చే ప్రయోగ పరీక్షలను, వార్షిక పరీక్షలను శ్రద్ధగా వహించాలన్నారు.
SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29వ తేదీ ఉదయం 6:00 గంటల నుండి జనవరి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ డా. బీ.అనురాధ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
NLG: గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే 10వ తరగతి విద్యార్థి శనివారం ఇంటి పైన ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోయారు.
NRPT: పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేయాలని డీఎస్పీ లింగయ్య అన్నారు. శనివారం మద్దూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై రామ్ లాల్ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా ఉండి వారికి న్యాయం చేయాలని అన్నారు.
ADB: సీఎం కప్-2024లో జిల్లా స్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా శనివారం క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DYSO వెంకటేశ్వర్లు, ట్రైబల్ ఆఫీసర్ పార్థసారథి, PD రాము, తదితరులున్నారు.
HYD: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాలను అందజేశారు. తప్పకుండా సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ పరిధిలో శనివారం పర్యటించారు. పత్తికుంట చెరువు, ధోబిఘాట్ నిర్మాణం, సీసీ రోడ్లు అభివృద్ధి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పనులకు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి వెంటనే పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానన్నారు.
JGL: ఎండపల్లి మండలం చర్లపల్లికి చెందిన గొర్రెల కాపరి సంకటి మల్లయ్యకు చెందిన 20 గొర్రెలు ఇటీవల కుక్కల దాడిలో మృతిచెందాయి. బాధిత కుటుంబాన్ని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించారు. జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తానని భరోసానిచ్చారు.
NRML: నిర్మల్‌లో కేజీబీవీ విద్యార్థినుల అనారోగ్యానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవీ విద్యార్థుల అనారోగ్యంపై అధికారులతో విచారణ జరపగా.. వారి నివేదిక ప్రకారం సదరు విద్యార్థులు గ్యాస్ట్రిక్ సమస్యతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరారని వారు స్పష్టం చేశారు.
మేడ్చల్: మేడ్చల్ పరిధిలో ఇటీవల అయ్యప్ప మహా పడిపూజ నిర్వహిస్తున్న సమయంలో మండపంలోకి వెళ్లి అయ్యప్ప స్వాములపై దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ అశోక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ ACP శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అయ్యప్ప స్వాములను అవమాన పరిచిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
KMR: జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశా ఫెసిలిటేటర్లతో నేడు సమీక్ష నిర్వహించినట్లు జిల్లా మాతాశిశు ఆరోగ్యాధికారి డా.అనురాధ తెలిపారు. జిల్లాలోని ఆశా ఫెసిలిటేటర్లతో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వైద్యసేవల పనితీరుపై సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్యం అందేటట్లు చూడాలని కోరారు.
JGL: వరంగల్- మంచిర్యాల జాతీయ రహదారి ఎన్‌హెచ్-163 జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటికి అప్పగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం మంథని మండలం కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూములలో ట్రెంచ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
HNK: సిక్కుమత పదవ గురువు గురు గోవింద్ సింగ్ మహారాజ్ కుమారులు హిందూ ధర్మ పరిరక్షణలో ప్రాణ త్యాగాలు చేసిన సందర్బంగా హనుమకొండ అలంకార్ గురుద్వార్ నుంచి చౌరస్తా వరకు శనివారం రాత్రి గురుద్వారా కమిటీ సర్దార్ హరిసింగ్ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధీగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
SRD: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
BDK: ఇల్లందు–కారేపల్లి మార్గంలోని ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్ వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి శనివారం తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.