NZB: బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలం రాగాపూర్ గ్రామపంచాయతీ చిన్నబొర్రమద్ది గ్రామంలో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. స్థానికులు శనివారం రాత్రి ప్రారంభించారు. గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవుకు కృతజ్ఞతలు తెలిపారు.
NZB: మోర్తాడ్ మండల కేంద్రంలో సీజ్ చేసిన ఇసుక సోమవారం వేలం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ చేసిన 64 ఇసుక కుప్పలను ఏడీ మైన్స్ నిజామాబాద్ సిబ్బందితో కలిసి మండల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను సోమవారం వేలం వేయనున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ వివరించారు.
SDPT: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా..అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోకల నర్సింలు(43)గ్రామంలోని ఊర చేరువులో చేపలు పట్టాడానికి వెళ్లి ఇంటికి రాకపోయే సరికి, గాలిస్తుండగా చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జనగాం: జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు.
NZB: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో అరుణాచల గిరిప్రదక్షణ యాత్రకు బస్సు సర్వీసును ప్రారంభించింది. జనవరి 4 శనివారం ఆర్మూర్ డిపో నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరనుంది. అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, జోగులాంబకు సర్వీసును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మోహన్ తెలిపారు.
ADB: ఉట్నూర్‌లోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈసందర్భంగా జాబ్ మేళాను ప్రారంభించిన ఉట్నూర్ ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలన్నారు. కాగా జాబ్ మేళాకు జిల్లా నుంచి 516 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.
ADB: జిల్లాలో 2023-24 విద్యాసంవత్సరంలో స్టార్ 50లో చదివిన విద్యార్థులు ఇటీవల అగర్తలోని నీట్లో నలుగురు గిరిజన విద్యార్థులు ప్రతిభ చాటారు. వారికి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూగుప్తా గురుకులం ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లను అందించారు. ఆర్సీఓ ఆగస్టియన్, స్టార్ 50 కోఆర్డినేటర్ మారుతి శర్మ పాల్గొన్నారు.
SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. 10 ప్రైవేట్ కంపెనీలు మేళాలో పాల్గొంటాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పది నుంచి బీటెక్ వరకు చదివిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.
NZB: పలు సందర్భాల్లో సెల్ ఫోన్లను పొగొట్టుకున్న బాధితులకు శనివారం రుద్రూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు బాధితులకు అందజేశారు. గ్రామానికి చెందిన ధనూష్, కిష్టయ్య సెల్ఫోన్లను పొగొట్టుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.
SRD: కలెక్టర్ కార్యాలయంలోని సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం ఉంటుందని ఏఈ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోతిరెడ్డిపల్లి, APHB కాలనీ, పోన్నా కాలనీ, సండే మార్కెట్, విద్యానగర్, బ్యాంకు కాలనీ, కలెక్టర్ కార్యాలయం బైపాస్ రోడ్‌లలో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు.
BDK: ఆళ్లపల్లి మండలంలో ఉన్న పోడు భూమి సమస్యలు పరిష్కరించాలని మండల ప్రజలు మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పోడు భూములకు త్రీఫేస్ కరెంటు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతానని హామీ ఇచ్చారు.
NLG: పోలీసు శాఖ తరుపున పౌరులందరికి ముందస్తు నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలను కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి కోదాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ మాట్లాడుతూ.. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజా భద్రతను, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
WGL: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను ఏటూరునాగారం పోలీసులు కాపాడారు. ఎస్సై తాజుద్దీన్ వివరాలు.. బెస్తవాడకు చెందిన ఇంద్రరాపు సమ్మక్క భర్త చనిపోవడంతో అత్తింటి వారితో ఆస్థి పంపకాల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన సమ్మక్క ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద ఆత్మహత్యకు యత్నించడంతో సమాచారం అందుకున్న పోలీసులు మహిళలు కాపాడారు.
BHNG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ హనుమంతరావు నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఉద్యోగుల పనితీరు, అటెండెన్స్, వారి వివరాలపై ఆరా తీశారు. కొద్దిసేపు రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపదలో వచ్చిన వారికి తక్షణ సాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.