WGL: రైలు తగిలి చేయి తెగిపడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. వరంగల్ రామన్నపేటకు చెందిన నరసింహ (50) వరంగల్ రైల్వే స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై నిలుచున్నాడు. అప్పుడే వచ్చిన జైపూర్ ఎక్స్ప్రెస్ అతడికి తగలడంతో చేయి తెగి పడింది. వెంటనే రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, ప్రథమ చికిత్స అందించారు.