HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మొదటి అంతస్తులోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో రేపు మంగళవారం ప్రత్యేక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి అక్కవరం శ్రీనివాస్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల సేమియా బాధితుల కోసం రక్తం సేకరించడం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.