ఖమ్మం: సీఎం కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగియనున్నట్లు డీవైఎస్ఓ సునీల్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మూడు రోజులుగా ఆడిన జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా పోటీలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
NRML: డంపింగ్ యార్డు నిర్వహణలో సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి నిర్మల్ సమీపంలోని డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తలను వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాలని సూచించారు.
SDPT: నంగునూరు మండలం రాంపూర్, మగ్దుంపూర్ గ్రామాల్లో విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఈ రోజు ఆయా గ్రామాల ప్రజలు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందించి ఎస్ఈ దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
ఖమ్మం: వైద్యారోగ్యశాఖలో ఎంఎల్ హెచ్ పి-19, బీడీకే మెడికల్ ఆఫీసర్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ డాక్టర్ కళావతిబాయి తెలిపారు. తాత్కాలిక, కాంట్రాక్టు, ఒప్పంద పద్ధతిలో నియమించే ఈ పోస్టులకు జనవరి 3లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు.
NLG: MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక,సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి ఒకప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్యవార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును12 ఫిబ్రవరి 2025 లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలన్నారు.
SDPT: నియోజకవర్గంలో వచ్చే ఎండాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
NZB: జిల్లాకు ఆదివారం ఎమ్మెల్సీ కవిత రానున్నారు. ఈ మేరకు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. డిచ్‌పల్లి నుంచి గులాబీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద తల్లి తెలంగాణ విగ్రహం వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకొని, విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించనున్నారు.
JGL: జిల్లాలో నూతన సంవత్సరం వేడుకల వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 31న ప్రత్యేకంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. వచ్చే ఏడాది జిల్లాలో కేసుల సంఖ్య తగ్గేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు.
HYD: మాదన్నపేట, సైదాబాద్ ప్రధాన రహదారి నుంచి మాదన్నపేట పాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రహదారిని నెల క్రితం తవ్వి వదిలేశారని స్థానికులు ఎంబీటీ మాజీ కార్పొరేటర్ అంజేద్ ఉల్లాఖాన్‌కు చెప్పారు. మాదన్నపేట రోడ్డు సమస్యపై స్థానిక MLA, కార్పొరేటర్‌తో GHMC, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.
WGL: గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 31వ తేదీ ఉదయం 11.30 గంటలకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరుగుతుందని కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 30న తెలంగాణ శాసనసభ సమావేశాలు ఉన్నందున 31కి మార్చి నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సభ్యులంతా గమనించి, ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
HYD: పట్టణ ప్రాంతంలో నివసించే నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ధరఖాస్తుల సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం అమీర్‌పేట్ డివిజన్ బీజేఆర్ నగర్‌లో సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జనగాం: జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్, పొలిటికల్ సైన్స్ బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నర్సయ్య తెలిపారు. ఈ నెల 31వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. జనవరి 2న దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
మేడ్చల్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేవేందర్ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, జెర్సీ లేన్, శ్రీ రామ కాలనీ, వెంకట సాయి నగర్, కురుమా నగర్, సత్యా నగర్, కేటీఆర్ నగర్, భరత్ నగర్ రోడ్ ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
HYD: ఉప్పల్ మిని శిల్పారామంలో శనివారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ గురు నృత్యాలయ డాన్స్ అకాడమి సౌజన్య చంద్రశేఖర్ శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశా కౌతం, నాగ స్తుతి, జనుత శబ్ధం, అన్నమాచార్య కీర్తనలు, భో బ్రహ్మాంజలి తదితర అంశాలను ప్రదర్శించారు.
ASF: జిల్లా తీర్యాణి మండలంలోని మంగి గ్రామంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా నేడు (ఆదివారం)మెగా వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై మాదవ్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మందులు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.