NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అనారోగ్యానికి గురై బంజారాహిల్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.