ADB: మావల మండలంలోని బట్టి సావర్గం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం పర్యటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూరాలని కలెక్టర్ సూచించారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని దశ దిశల చాటిన గొప్ప ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
KMR: జిల్లాలోనీ బాన్సువాడ బస్సు డిపోకు చెందిన పన్నాల వెంకటరెడ్డి ఉత్తమ డ్రైవర్‌గా ఎన్నికయ్యారు. ఎలాంటి ప్రమాదాల చేయకుండా ఉత్తమ డ్రైవర్‌గా ఎన్నికనయ్యారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిపో మేనేజర్ సరితా దేవి అవార్డు అందజేశారు. ఆయనకు ఆర్టీసీ సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.
NLG: పట్టణంలోని 18వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలోని నవదీప్(11) శుక్రవారం ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలకు గాలిపటం చుట్టుకుంది. ఇనుప రాడ్‌తో దానిని తీయడానికి ప్రయత్నించే క్రమంలో నవదీప్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తల్లిదండ్రులు బాలుడిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం HYD గాంధీ ఆసుపత్రికి తరలించారు.
VKB: జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం పాఠశాలల్లో చేపట్టిన మన ఊరు-మనబడి పథకం కింద రూ.10.35 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 1,130 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 371 పాఠశాలలను ఎంపిక చేశారు. బిల్లులపై ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు DEO రేణుకా దేవి తెలిపారు.
HYD: దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో తొలి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం దశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డుకు అవతల దీన్ని చేపట్టనున్నారు. సుమారు ఆరు ప్రాంతాల్లోని రైల్వే లైన్‌ను ఇది క్రాస్ చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు రూ.13,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
HYD: హైదరాబాద్ మహానగర అభివృద్ధిసంస్థ (HMDA) భారీ ఎత్తున భూసమీకరణకు సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా పెద్దఅంబర్‌పేట్, ఘట్కేసర్, బాలాపూర్ మండలాల పరిధిలో.. భూ సమీకరణ పథకం కింద 515 ఎకరాల్లో భారీ లే అవుట్లను చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.
HYD: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని బిల్లులు చెల్లించలేని నిజమైన పేదలు సీఎం ఆర్ఎఫ్ లబ్ధి పొందాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. శుక్రవారం రిజ్వానా సుల్తానాకు మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరంతరం కొనసాగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KMR: ఎల్లారెడ్డి ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి విజేతగా నిలిచి రూ. 51,000 వేల నగదు బహుమతిని గెలుపొందారు. రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (A)రూ. 21, 000 నగదు అందుకున్నారు. మూడవ విజేతగా జాయింట్ విన్నర్( భిక్కనూర్, మాచాపూర్) రూ.11,000 నగదు పొందారు. సీఐ రవీందర్ నాయక్ బహుమతులను అందజేశారు.
VKB: కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, విద్యుత్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల పనుల కారణంగా విద్యుత్, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ ఉన్నారు.
HYD: మియాపూర్‌లో తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మియాపూర్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ అభిమానులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట వెళ్లే హైటెన్షన్ రోడ్‌లోని సోనీ గార్డెన్‌ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం అవుతుందన్నారు. స్మారకోపన్యాసం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
MDK: అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం చేగుంట మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు వడియారంలోని ఓ ఫంక్షన్ హాల్లో చేగుంట, నార్సింగి మండలాల లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా రక్ చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. అనంతరం గొల్లపల్లిలో నిర్మించిన విద్యుత్తు ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు.
MDK: నర్సాపూర్ జవహర్ విద్యాలయం(వర్గల్)లో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు క్లస్టర్ స్థాయి అధికారి డాక్టర్ రవి, బ్లాక్ అధికారి తారాసింగ్‌లో ఒక ప్రకటనలో తెలిపారు. బీయూపీ ఎస్ 216, విష్ణు ఉన్నత పాఠశాలలో 173 మంది పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
SDPT: తొగుట మండలంలో శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.