KMM: ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్ష శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.