SRCL: ఎల్లారెడ్డిపేట(M) అక్కపల్లిలో వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. గ్రామానికి చెందిన రాధిక అనే మహిళకు హరిదాస్నగర్ గ్రామానికి చెందిన చీకట్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. భర్త శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ రాజయ్య రాధికను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.