BDK: జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, కావడిగుడ్ల, కొండారెడ్ల గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గిరి వికాస్ పథకం ద్వారా కరెంటు బోర్ మోటార్ల ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజులలో పోడు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.