JGL: మెట్పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించి హెల్త్ చెకప్ చేశారు. ఈ సంద్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయించి, అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.