MDK: జోగిపేటలోని శనివారం జరిగిన నవోదయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జోగిపేటలోని జడ్పీ బాలుర పాఠశాల, డాన్ బాస్కో పాఠశాలలోని 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయని అందోల్ యంఈవో కృష్ణ తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 342 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 173 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగతా 169 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారని తెలిపారు.
JGL: తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్స్ ఏఈఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఏ. సంధ్య సంపత్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్ప గుచ్చం అందజేశారు. ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం: ఎర్రుపాలెం మండలంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ మేరకు మధిర మంత్రి క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా మండలంలోని నరసింహపురం, బుచ్చిరెడ్డిపాలెం చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
NRPT: జిల్లా ఎంపీడీవోల నూతన కార్యవర్గాన్ని శనివారం నారాయణపేటలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు ధనుంజయ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షురాలుగా సాయి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీధర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఎంపీడీవోల సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.
WNP: రామకృష్ణాపూర్ మండలం, పట్టణానికి చెందిన కడమంచి భీమరాజు(70) సింగరేణి విశ్రాంతి కార్మికుడు. గత కొంతకాలంగా భీమరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మనస్తాపానికి గురైన భీమరాజు శనివారం తన ఇంటి ముందు షెడ్డులో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
BDK: కొత్త రేషన్ కార్డులకు అర్హత పొందిన వారి జాబితాలో చాలామంది పేర్లు లేవని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ఆదివారం అన్నారు. 10వ వార్డులో విడుదలైన రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్టు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపాలన ద్వారా చాలామంది అర్హులైన వారు అప్లై చేసుకుంటే కొందరి పేర్లు మాత్రమే వచ్చాయని చెప్పారు.
KMM: ప్రజా నాట్య మండలి నేత కుంజ వెంకన్న మృతి సీపీఎం పార్టీకి తీరని లోటని జిల్లా పార్టీ నాయకులు కొండపల్లి నాగేశ్వరావు అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామారావు, రేగళ్ల మంగయ్య, కొండయ్య, ప్రభాకర్, సీతారాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
NRPT: క్రీడలు పోటీ తత్వాన్ని పెంచుతాయని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ గెలుపొందిన వారికి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఇతర ప్రాంతాలతో పోటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
నిజాంసాగర్: మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శనివారం సాయంత్రం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో భక్త బృందం శేషారావు, పడిగెల సుభాష్, అశోక్, అనిత, కాషా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
NGKL: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. హైదరాబాద్ నుంచి మంత్రులు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శనివారం కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ… గ్రామసభల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తామన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందుకోసం జిల్లా పోలీసు యంత్రాంగంపూర్తిఏర్పాట్లు చేసింది.
HYD: హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన పట్టణ వాసులు, విద్యార్థులు సెలవులు పూర్తవడంతో పట్నం బాట పట్టారు. దీంతో చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ కూడళ్లలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఈ సందర్భంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.
KMR: అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డు పరిశీలనలో పేరు లేకపోతే లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగే గ్రామ సభల్లో, ఎంపీడీవో కార్యాలయాల్లోని ప్రజా సేవ కేంద్రాల్లో సంబంధిత పత్రాలు అందజేయాలని సూచించారు.
NZB: నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ఆదివారం జిల్లాకు వస్తున్న ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నూడ ఛైర్మన్ కేశవేణు తెలిపారు. జిల్లా కేంద్రంలో అమృత్ పథకం కింద 18 మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పైలాన్ ఆవిష్కరించనున్నారు.
NZB: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు శనివారం తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. నిజామాబాద్ హమాల్వాడికి చెందిన నాగం సాయికుమార్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.