NLG: పట్టణంలోని 18వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న కందగట్ల కృష్ణ, గీత కుమారుడు నవదీప్ శుక్రవారం ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం HYD గౌతమ్ న్యూరో హాస్పిటల్‌కు చేరుకొని తల్లిదండ్రులకు రూ.20 వేల ఆర్థికసాయం చేశారు.
BNR: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని భువనగిరి RDO యం. కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని సర్వే ప్రక్రియను పరిశీలించారు. RDO మాట్లాడుతూ వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని అన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
SDPT: పటాన్ చెరు బస్టాండ్‌లో ఓ గర్భిణీ సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే ఉన్న సంగారెడ్డి షీటీం, పోలీసు వారు వెంటనే స్పందించి పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స చేయించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గర్భిణీ కుటుంబ సభ్యులు షీటీం, పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
HYD: ఇటీవల వరుస సెలవులు రావడంతో గోల్కొండ కోట పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సైతం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. కోటలోని ఆయుధాగారం, నగీనాబాగ్ తదితర ప్రాంతాలు కిటకిటలాడాయి. నగీనాబాగ్‌ని నాగదేవత పుట్టకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భక్త రామదాసు చెరసాలను చూసి కొందరు పర్యాటకులు భక్తితో పులకించిపోయారు.
SDPT: పటాన్ చెరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల విహార యాత్రకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ రూ. 30వేల ఆర్థికసాయం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు లోకజ్ఞానం చాలా అవసరం అన్నారు. విహార, విజ్ఞాన యాత్రలకు వెళ్లడం కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు.
SRPT: జిల్లాకేంద్రంలోని జమ్మిగడ్డలో గలన్యూ జనరేషన్ స్కూల్లో జనవరి 25న తనతండ్రి దారోజు జానకిరాములు జ్ఞాపకార్థం మెగా ఉద్యోగమేళ నిర్వహిస్తున్నట్లు దారోజు జానకిరాములు ఫౌండేషన్ చైర్మన్ దారోజు భాగ్యరాజు తెలిపారు. ఆదివారం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగయువతకు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సహకారంతోనిర్వహిస్తున్నారనారు.
SRPT: ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంమ్మూర్తి, వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, గట్టు శ్రీను, వల్దాస్ దేవేందర్, అరవింద్ రెడ్డి, కరుణాకర్, తండు శ్రీను, తదితరులు ఉన్నారు.
SRD: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాణి నగర్‌లో పలు అపార్ట్‌మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్‌ను కలిసి ఎం.ఎల్.సి ఎన్నికల ప్రాధాన్యత, ఒటరు నమోదు విధి విధానాలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు అనిల్ చారీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. కొండాపూర్ పారిశ్రామికవాడ సమీపంలో ముప్పిరెడ్డిపల్లి శివారులో ఉన్న పాత బావిలో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గ్రామస్తులు గుర్తించారు. చాలా రోజుల క్రితం మృతి చెందడంతో కుళ్లిపోయినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
SRPT: హుజూర్‌నగర్ మండలం లింగగిరి-కల్మలచెరువు మధ్య డబుల్ రోడ్డు నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ డబుల్ రోడ్డు నిర్మాణంతో రవాణా పరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు.
SRPT: మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో జరుగుతున్న రైతు భరోసా, రేషన్ కార్డు సర్వేను ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎవ్వరు కూడా అధైర్య పడవద్దని, ఈనెల 21 నుంచి 24 వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి జాబితాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
NZB: మాస్టర్ ప్లాన్ జీఓను రద్దు చేయాలని కోరుతూ జిల్లా ప్రజా ప్రతినిధులను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాధిత రైతులు ఆదివారం నిర్ణయించుకున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ జోన్‌లో భూములు కోల్పోనున్న బాధిత రైతులు ఎనిమిది రోజులపాటు ప్రణాళిక రూపొందించారు.
KMR: జిల్లాలోని గ్రామీణస్థాయిలో ప్రజలకు ఆహార కల్తీపై అవగాహన కల్పిస్తామని వినియోగదారుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి పేర్కొన్నారు. నేడు నగరంలోని సమితి కార్యాలయంలో మాట్లాడారు. జిల్లా కార్యవర్గాన్ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా రామనాథం, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడిగా అనిల్ ఉన్నారు.
NZB: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పధకాలపై నిజామాబాద్ కలెక్టర్ కార్యలయంలో సమన్వయ సమావేశము నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
NZB: భీమ్గల్ మండలం బడా భీమ్గగల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బడా భీమగల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీల్, గ్రామ ప్రెసిడెంట్ సురేశ్, మండల జనరల్ సెక్రటరీ విజయ్, తదితరులు ఉన్నారు.