• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

MLG: ప్రజా భవన్లో “Goddess of Folk–Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. బుక్‌ను రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. జాతర అరుదైన ఫోటోలతో ఆకర్షణగా మేడారం కాఫీ టేబుల్ బుక్ ఉందని మంత్రి సీతక్క అన్నారు.

February 20, 2026 / 03:43 PM IST

ఉచిత కంటి వైద్య పరీక్షలు…!

NZB: పోతంగల్ మండలం గన్నారం, లింగాపూర్ గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 65 మందికి పరీక్షలు చేయగా, 14మందికి మోతెబిందు ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.

February 20, 2026 / 03:40 PM IST

ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో శుక్రవారం నూతన పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయమన్నారు.

February 20, 2026 / 03:37 PM IST

కేంద్ర గ్రంథాలయాన్ని సదర్శించిన ప్రాజెక్టు అధికారి

భద్రాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఈరోజు సందర్శించారు. గ్రంథాలయ పరిసరాలు, పుస్తకాలు, అందుబాటులో ఉన్న వనరులు, పని వేళలు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంచి గ్రంథాలయం మనకు అందుబాటులో ఉండటం అదృష్టకరమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

February 20, 2026 / 03:33 PM IST

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో చిన్నారెడ్డి భేటీ

WNP: ఏఐసీసీ అధ్యక్షులు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఇంద్ర భవన్‌లో ఖర్గేకు పూల బొకే ఇచ్చి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని ఖర్గే అభినందించినట్లు చిన్నారెడ్డి తెలిపారు.

February 20, 2026 / 03:31 PM IST

గ్రామాభివృద్ధిలో సర్పంచులే కీలకం: కలెక్టర్

NGKL: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీలో కల్వకుర్తి డివిజన్‌కు చెందిన 116 మంది నూతన సర్పంచులకు రెండో విడత శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు.

February 20, 2026 / 03:30 PM IST

ఆదరిస్తే మరింత అభివృద్ధి: MLA

KNR: జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే ప్రజలు మరింత పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో శుక్రవారం తిమ్మాపూర్ మండలానికి చెందిన 57 మందికి సీఎంఆర్ఎఫ్, 67 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

February 20, 2026 / 03:30 PM IST

శ్మశానవాటి పనులు నాణ్యతతో చేపట్టాలి: కౌన్సిలర్

VKB: స్మశాన వాటిక పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తిచేయాలని కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ మున్సిపల్లోని రెండో వార్డులో కొనసాగుతున్న శ్మశానవాటి పనులను కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్మశానవాటికలు మంచినీటి వసతితో పాటు అన్ని సౌకర్యాలు తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 03:30 PM IST

నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలి: డీఐవో

WGL: నిబంధనల మేరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఇతరులకు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 26 థియరీ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడుతాయని DIEO తెలిపారు.

February 20, 2026 / 03:29 PM IST

వెన్నం రాఘవేందర్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి నివాళి

మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో ఓ టీవీ ఛానల్ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సవిందాన్ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 20, 2026 / 03:27 PM IST

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

NGKL: తెల్కపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:26 PM IST

పది పరీక్షలు సజావుగా నిర్వహించాలి: డీఈవో

SRD: జిల్లాలో మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యుత్, తాగు నీరు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

February 20, 2026 / 03:22 PM IST

ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: బెజ్జంకి ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు చేయగా, ఉపాధ్యాయులకు ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కొండ్ల విద్యాప్రకాశ్ కుటుంబం విద్యార్థులకు బహుమతులు ఇచ్చింది. మండల విద్యాధికారి మహతి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:17 PM IST

యువత కోసం ‘హరీష్ అన్న’ ఉద్యోగ యాప్ లాంచ్

SDPT: సిద్దిపేట యువత కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు సొంత ఖర్చుతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ప్రారంభించారు. ఇందులో 57 రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ పోటీ పరీక్షార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:15 PM IST

మల్లె బోయినపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

MBNR: జడ్చర్ల మండలం మల్లె బోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత నివాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

February 20, 2026 / 03:15 PM IST