SDPT: సిద్దిపేట యువత కోసం ఎమ్మెల్యే హరీశ్ రావు సొంత ఖర్చుతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ప్రారంభించారు. ఇందులో 57 రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ క్లాసులు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ యాప్ పోటీ పరీక్షార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.