SDPT: బెజ్జంకి ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు చేయగా, ఉపాధ్యాయులకు ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. కొండ్ల విద్యాప్రకాశ్ కుటుంబం విద్యార్థులకు బహుమతులు ఇచ్చింది. మండల విద్యాధికారి మహతి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.