SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి.