MBNR: ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులకు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు ఫిబ్రవరి 1వ తేదీ లోపు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సంక్షేమ అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సర 5వ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు గానూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.100 చెల్లించాలని తెలిపారు.
SRPT: కోదాడ మండలం రామాపురం వద్ద ప్రైవేట్ బస్సును కోదాడ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నారనే అనుమానంతో తనిఖీ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. బస్సులో ఆయుర్వేదిక్ మెడిసిన్ గుర్తించామని దాన్ని తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తులను కోదాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నామని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
SRPT: డిసెంబర్ 31 వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం తెలిపారు. వేడుకలు నిర్వహించుకునేవారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, మహిళలను కించపరచకుండా ప్రమాదాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
PDPL: జిల్లా కలెక్టరేట్‌లో CITU గ్రామ పంచాయతీ వర్కర్స్, జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, GO 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలని కోరారు.
MNCL: TNGO మంచిర్యాలలోని పురపాలక శాఖలో సభ్యత్వ నమోదును ఆదివారం చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, టౌన్ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో పురపాలక శాఖలో పని చేస్తున్న అధికారులకు సభ్యత్వం అందజేశారు. TNGO యూనియన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కార్యదర్శి అజయ్ ప్రశాంత్, ఉపాధ్యక్షుడు ప్రకాశ్, కోశాధికారి సందీప్, విజయ, తదితరులు ఉన్నారు.
ADB: రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న, శ్రావణి జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు ఎంపికయినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్య దర్శి నారాయణరెడ్డి తెలిపారు. స్వప్న రాష్ట్ర మహిళా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుందన్నారు. ఆయనతో పాటు పలువురు వారిని అభినందించారు.
BDK: అశ్వారావుపేటలో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్లను రెవెన్యూ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. గుర్రాల చెరువు రోడ్డులో ఉన్న సఖీ కేంద్రంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 29 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ ప్రభాకర్ రావు ఆదేశాలతో సిలిండర్లను భారత్ గ్యాస్ గోడౌన్‌కు తరలించి భద్రపరిచారు.
MNCL: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జన్నారం ఎస్సై గుండేటి రాజ వర్ధన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం జన్నారం పట్టణం పోలీస్ స్టేషన్‌లో, నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన జంగు సైరన్ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సందర్భంగా ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నిరటి రాం ప్రసాద్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాల వైపు చూడకుండా ఉండాలని కోరుతున్నారు.
HYD: గుండెపోటుతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. భువనగిరికి చెందిన దోసపాటి బాలరాజు (35) హైదరాబాద్ మొదటి బెటాలియన్ యూసఫ్‌గూడలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండటంతో మార్గ మధ్యలో చనిపోయారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ASF: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని రాగాపూర్ గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయన్ను శాలువాతో సత్కరించారు.
ADB: మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు కేంద్రం భారతరత్న అవార్డుకు అర్హులని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం కడెంలో ఆయన మాట్లాడుతూ.. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ కుదెలు అయినపుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుండి కాపాడాయన్నారు. ఆర్థికవేత్తగా గుర్తింపు పొంది ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారన్నారు.
HYD: గచ్చిబౌలీ బాలయోగి స్టేడియంలో జాతీయ మాస్టర్స్ అథ్లెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మాస్టర్స్ క్రీడ పోటీలు జనవరి 4, 5వ తేదీన నిర్వహించనున్నట్లు మాస్టర్స్ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పోటీలకు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల సైతం పాల్గొంటారన్నారు.
HYD: భాగ్యనగరం వేదికగా జరుగుతున్న 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. సాయంత్రం జరిగే ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి, హైకోర్టు న్యాయమూర్తి, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శనలోని 350 స్టాళ్లలో కనీసం రూ.15 కోట్ల పుస్తకాలు అమ్ముడైనట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
JN: లింగాల మండలం చీటూరు గ్రామంలో గ్రామశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాశాఖ అధ్యక్షులు నకిర్త మల్లయ్య, మాజీ ఎంపీపీ పసుల సోమ నరసయ్య, మాజీ సర్పంచ్ ఐలా మల్లేశం, మాజీ ఉపసర్పంచ్ బర్ల గణేష్, కిసాన్ సెల్ నాయకులు నరసింహులు, తదితరులున్నారు.
HYD: సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్ పేట వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పలువురు ఇల్లు, స్థలాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలాంటివారికి మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇల్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం డబుల్ రేటు ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు.