HYD: గవర్నర్ నేడు ఉదయం 8గంటలకు ములుగు వెళ్తుండడంతో ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ జాంలో చిక్కుకోకుండా ఉదయం 8:30నిమిషాలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆలస్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.