BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ ఏరియా రామవరంలో సీపీఐ ఆధ్వర్యంలో బరిగెల సాయిలు ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని బరిగేల సాయిలు స్థూపానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రామవరం ప్రాంతంలో సీపీఐ అభివృద్ధి కోసం సాయిలు ఎంతగానో కృషి చేశారని అన్నారు.
ఖమ్మం: ములుగులో సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. 20రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
KMR: జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న బైక్ ర్యాలీకి పెద్ద కొడఫ్గల్ మండల ఎంఆర్పీఎస్ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సర్వగల్ల రవీందర్ మాట్లాడుతూ.. ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఉన్నారు.
ADB: మాస్టిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నాగిల్ల నర్సయ్యను కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన మాస్టిన్ సంఘం నాయకులు సన్మానించారు. ఆదివారం హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశానికి మాస్టిన్ సంఘం నాయకులు హాజరై అధ్యక్షుడు నర్సయ్యను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఇ.పి, ఓపీ రిజిస్టర్, డ్రగ్ స్టోర్ మరియు లాబరేటరీలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ… క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా అనుమానితులకు 100 శాతం పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలను కోరారు.
BDK: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్ధిదారుల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోయినా సాదా బైనామాతో ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
SDPT: జిల్లా రాయపోల్ మండలంలోని రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నరేష్ తెలిపారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ లో భాగంగా రాయితీపై అందుబాటులో ఉన్నాయన్నారు. మొక్కజొన్న విత్తనాలు అవసరమున్న రైతులు పట్టదార్ పాస్ బుక్, ఆధార్ జిరాక్స్ కాపీలతో సంబంధిత ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.
NZB: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో CMRF చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులు సాయి కీర్తనకు రూ.60 వేలు, సంధ్యా రాణికి రూ.14 వేల CMRF చెక్కులను అందజేశారు.
NRPT: ఊట్కూరు మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో ఆదివారం RSS సాంఘిక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ప్రధాన రహదారుల గుండా పథ సంచలన్ నిర్వహించి అనంతరం తిరిగి అక్కడే సమావేశం నిర్వహిస్తామన్నారు.
BDK: అప్పుల బాధతో వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తగూడెంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. రామవరం ఏరియా ఎస్సీబీ నగర్‌కు చెందిన భూక్యా రవి సుతారి మేస్త్రిగా పని చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావటంతో వాటిని తీర్చే దారిలేక ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రవి మృతితో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది.
వనపర్తి: రాష్ట్ర స్థాయి సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో వనపర్తి మండలం చిట్యాల విద్యార్థిని సింగరపు ఝాన్సీ బంగారు పతకం సాధించినట్లు చిట్యాల కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీ మాస్టర్ వరుణ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అండర్ 13, 14, 15 విభాగాల్లో 45 కేజీల పాయింట్ ఫైట్ 4 రౌండ్లలో పాల్గొని పతకం సాధించారని వెల్లడించారు.
WGL: నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈ రోజు అలంకరణ చేశారు. నేడు ఆదివారం సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
SDPT: గుర్తు తెలియని వ్యక్తులు శివుడి ఆలయంపై దాడికి యత్నించిన ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఊరి చెరువు గట్టున ఉన్న శివాలయానికి రోజు మాదిరిగా భక్తులు దర్శనానికి వచ్చేసరికి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భగుడిలోకి ఇసుకను చల్లి అక్కడే ఉన్న పలు దేవతామూర్తుల ఫోటోలకు నిప్పు అంటించి ఆలయం లోపల పడేసినట్లు కనిపించింది.
NGKL: పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఎస్ఓ సువర్ణ తెలిపారు. ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించేందుకు ఆసక్తి ఉండి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బీఈడీ, సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ పూర్తి చేసిన వారు అర్హులని ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవలన్నారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారాన్ని త్వరగా అందించాలని కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. అలాగే గ్రామంలో మిగిలిన 107 ఇండ్లు మంజూరు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు.