RR: నార్సింగి మున్సిపల్ పరిధిలోని నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్లో 81 లక్షల పీఎం శ్రీ నిధుల ద్వారా నిర్మించిన 6 తరగతి గదులు, 1.43 లక్షల AWP నిధుల ద్వారా నిర్మించిన 11 తరగతి గదులను ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.