KDP: రాజుపాలెం మండలం వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వామి ఆలయాల భూములను వేలం వేయనున్నారు. శనివారం ఆలయంలో వేలం జరుగుతుందని ఈవో వెంకటరమణ తెలిపారు. 11.29 ఎకరాల మిగులు భూమిని మూడేళ్లపాటు కౌలుకు ఇస్తామని చెప్పారు. అలాగే భక్తులు సమర్పించిన పులగం బియ్యాన్ని వేలం వేస్తామని.. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.