MNCL : జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో ఉపాధి హామీ పనుల జాతర గ్రామసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటుందని పంచాయతీ సెక్రెటరీ విశ్వ తెలిపారు. ఉపాధి హామీ పనుల ప్రారంభోత్సవం, కొత్తగా చేపట్టే పనుల యొక్క భూమి పూజ కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.