మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. దీనిపై చిరు స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ‘నీ ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా మనసును తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాలను, నీ పోరాటాలను నేను అంతగా ఆస్వాదిస్తున్నా. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా’ అని పేర్కొన్నారు.