SKLM: జిల్లాలోని డీఎల్టీసీలో మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్ కోర్సు అందుబాటులోకి వచ్చిందని శ్రీకాకుళం డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహనరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయని ఆయన వివరించారు. కోర్సులకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9505161701 నెంబర్ను సంప్రదించాలన్నారు.