W.G: కదల్లేని స్థితిలో ఇంటి వద్దనే ఉంటున్న వృద్ధులకు సంచార శకటం ద్వారా వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని ఆదివారం తణుకులో కొనసాగించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలు అందించారు. వీరికి ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ వైద్య పరీక్షలు నిర్వహించారు.