KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం గ్రామం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఓ యువకుడికి డెంగ్యూ పాజీటివ్ నిర్ధారణ కావటంతో వైద్య అధికారుల గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహించి జ్వర పీడిత వివరాలు నమోదు చేసుకుని రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు.