KDP: కమలాపురం మండలంలోని పెద్దచెప్పలి గ్రామంలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారి సుధాకర్, SI విద్యాసాగర్, AO సరస్వతి ఈ తనిఖీలను చేపట్టారు. ఇందులో భాగంగా దుకాణాల్లో ఉన్న ఎరువుల స్టాక్‌ను పరిశీలించి, బిల్ బుక్స్, రిజిస్టర్లను సరి చూశారు. అనంతరం ఎరువుల నిల్వలు, వాటి ధరలు డిస్ప్లే బోర్డుపై స్పష్టంగా చూపించాలన్నారు.