VZM: ఎల్.కోట గ్రామానికి చెందిన యశ్వంత్ అనే నిరుపేద విద్యార్థికి MLA లలితకుమారి ఆదివారం ఆర్ధిక సాయం అందజేశారు. బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆర్థిక స్తోమత లేకపోవడంతో తనను సంప్రదించారని ఎమ్మెల్యే తెలిపారు. P-4లో భాగంగా విద్యార్థి యశ్వంత్ చదువు బాధ్యతలను పూర్తిగా తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏడాది యస్వంత్ చదువుకు రూ.25వేలు ఇస్తానన్నారు.