TG: పార్టీ ఫిరాయింపులపై KTRవి దొంగ ఏడుపులు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ‘MLA లు రాజీనామ చేయాలని అడిగే నైతికహక్కు KTRకు లేదు. BRSలో చేరిన 60 మంది MLA, MLCలతో రాజీనామా చేయించారా?. BRS చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?. ఉపఎన్నికలు వచ్చినా గెలిపించే దమ్ము CM రేవంత్‌కు ఉంది. KTR సత్తా ఏంటో స్థానికి ఎన్నికల్లో చూపాలి’ అని విమర్శించారు.