KMM: జీవితంపై విరక్తితో ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. జీళ్ళచెరువుకు చెందిన భాస్కర్(28) మద్యానికి బానిసై ఆపై జీవితంపై విరక్తితో ఈనెల 14న గడ్డి మందు తాగాడు. కాగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.