CTR: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో 90 శాతం ఇప్పటికే అమలు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం అయిన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలలో మంచి పేరు వచ్చిందని స్పష్టం చేశారు. దీనిని ఓర్వలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు.