GNTR: సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు వరంగా మారాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ తెలిపారు. ఆదివారం పొన్నూరు రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముగ్గురు లబ్ధిదారులకు రూ.5 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఆరోగ్య రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నారని కొనియాడారు.