MNCL: బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాలలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కన్నాలకి చెందిన పుల్లగొర్ల పుష్పలత అనే మహిళను అరెస్ట్ చేసినట్లు రూరల్ CI హనోక్ ఆదివారం తెలిపారు. ఈనెల 22న ఇందూరి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడి బంగారం, రూ.15 వేలు దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితురాలిని కోర్ట్లో హజరుపరిచి రిమాండ్కు తరలించమన్నారు.